ప్రకాష్ రాజ్ ఉలవచారు కోసం రెజీనా?

ప్రకాష్ రాజ్ ఉలవచారు కోసం రెజీనా?

Published on Jan 27, 2013 9:58 AM IST

Rejina
ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న తమిళ భామ రెజీనా ఇటీవలే సాయి ధరమ్ తేజ రెండవ సినిమా, నారా రోహిత్ – తాతినేని సత్య కాంబినేషన్లో రానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపికైంది. ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో రానున్న ‘ఉలవచారు భిర్యాని’ కోసం ప్రకాష్ రాజ్ రెజీనా మధ్య మంతనాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని నాలుగు కీలక పాత్రాల్లో ఒక పాత్రకి స్నేహ ఎంపిక కాగా మరొక పాత్ర కోసం రెజీనాని పరిశీలిస్తున్నారు.

ఇది మలయాళంలో హిట్ అయిన ‘సాల్ట్ అండ్ పెప్పర్’ అనే సినిమాకి రీమేక్. ఇది రెండు జంటల చుట్టూ తిరిగే కథ అందులో ప్రకాష్ రాజ్ – స్నేహ ఒక జంటగా, మరొక జంట కోసమే అన్వేషణ అజరుగుతోంది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించనున్న ఈ సినిమాకి సిరివెన్నెల సీతారమశాస్త్రి పాటలు రాయనున్నారు. ఈ సినిమా గురించి మరికొన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తన స్వీయ నిర్మాణంలో అల్లు శిరీష్, యామి గౌతమ్ జంటగా నటించిన ‘గౌరవం’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్నాడు.

తాజా వార్తలు