రవితేజ ‘బలుపు’ ఫస్ట్ లుక్ విడుదల

రవితేజ ‘బలుపు’ ఫస్ట్ లుక్ విడుదల

Published on Jan 25, 2013 1:10 PM IST

Balupu
డాన్ శీను కాంబినేషన్ రిపీట్ అవుతూ తెరకెక్కుతున్న చిత్రం ‘బలుపు’. రేపు జనవరి 26న రవితేజ పుట్టిన రోజు సందర్భంగా బలుపు చిత్ర ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేసారు. ఫస్ట్ లుక్ లోగోని శృతి హాసన్ విడుదల చేయగా ఫస్ట్ లుక్ పోస్టర్ అంజలి విడుదల చేసింది. రవితేజ టీజర్ విడుదల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి మాటలు అందించిన కోన వెంకట్ మాట్లాడుతూ రవితేజతో కలిసి నేను ఎన్నో సినిమాలకు పని చేసాను. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. గోపీచంద్ నాకు ఎప్పటి నుండో తెలుసు. అతను శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నప్పటి నుండి తెలుసు. రవితేజ బలుపు ఈ సినిమాలో చుపించబోతున్నాడు అన్నారు. గోపీచంద్ మాట్లాడుతూ ఈ సినిమా టీజర్లో రవితేజ బలుపు 10% మాత్రమే చూసారు.మిగతా 90% సినిమాలో చూడబోతున్నారు. ఈ కథ చెప్పడానికి అంజలి దగ్గరికి వెళ్ళినపుడు నా మీద నమ్మకంతో కథ వినకుండానే ఓకే చెప్పేసింది అన్నారు.

తాజా వార్తలు