ఎన్.టి.ఆర్ కెరీర్లోనే హై కామెడీ ఎంటర్టైనింగ్ మూవీ ‘బాద్ షా’

ఎన్.టి.ఆర్ కెరీర్లోనే హై కామెడీ ఎంటర్టైనింగ్ మూవీ ‘బాద్ షా’

Published on Jan 22, 2013 8:15 AM IST

NTR-in-Baadshah2

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమాలన్నీ పవర్ఫుల్ యాక్షన్, ఎమోషనల్ డైలాగ్స్ తో ఉంటాయి. ఎన్.టి.ఆర్ డాన్సులు, సూపర్బ్ డైలాగ్ డెలివరీ పక్కన పెడితే కామెడీని పండించడంలో కూడా ఎన్.టి.ఆర్ సిద్దహస్తుడని తను చేసిన ‘అదుర్స్’ సినిమాతో నిరూపించుకున్నాడు. అందులో చేసిన చారి పాత్రతో అందరినీ తెగ నవ్వించాడు. దానికన్నా మించిన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగులను తన రాబోయే సినిమా ‘బాద్ షా’ లో ఫాన్స్ చూడవచ్చు. మేము విన్న సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ ఇప్పటివరకూ చేసిన అన్ని సినిమాలకంటే ‘బాద్ షా’ ఫుల్ కామెడీగా ఉంటుందని అంటున్నారు.

డైరెక్టర్ శ్రీను వైట్ల, కోనా వెంకట్, గోపి మోహన్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడా తగ్గ కూడదని ఎంతో కసితో ఈ స్క్రిప్ట్ కోసం పని చేసారు. ఈ సినిమా టీం మొత్తం కూడా సినిమా రిసల్ట్ పై ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఏప్రిల్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు