ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. లేటెస్ట్ టీజర్ తో మంచి అంచనాలు ఏర్పర్చుకున్న ఈ చిత్రం మిగిలి ఉన్న షూట్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. అయితే ఈ భారీ చిత్రంలో మెగాస్టార్ తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. సిద్ధ అనే పవర్ ఫుల్ పాత్రను కొరటాల డిజైన్ చేశారు.
అయితే ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం చరణ్ పై కొన్ని సన్నివేశాలను మేకర్స్ తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. ఆ మధ్య వచ్చిన టాక్ స్టైలిష్ స్టార్ చేసిన “పుష్ప” రంపచోడవరం అడవుల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశలను తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ భారీ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది అని టాక్. అలాగే ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి గాను మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.