ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీనే..!

ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీనే..!

Published on Feb 14, 2021 12:32 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు ఏ లెవెల్లో ఉందో తెలిసిందే. కానీ తమ అభిమాన హీరో విషయంలో మాత్రం ప్రతీ అంశంలో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఉత్తమంగా ఉండాలి అనుకుంటారు. మరి వారి అంచనాలను తన లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్” మేకర్స్ అందుకున్నట్టే అని చెప్పాలి.

ముందు ఏ హీరో అభిమాని అయినా కూడా తన హీరో నుంచి ఎలాంటి సినిమా వస్తుంది అనే దాని కంటే అందులో తన హీరో ఎలా కనిపిస్తున్నాడు అన్నది మొదటగా చూస్తాడు. మరి దానిని ప్రభాస్ తన లాస్ట్ చిత్రం “సాహో” తో అభిమానులు సంతృప్తి పరచడంలో కాస్త ఏకాగ్రత మిస్ చేశారు.

దీనితో రాధే శ్యామ్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాస్ చాలా గ్లామరస్ గా కనిపించాలని డార్లింగ్ ఫ్యాన్స్ కోరుకున్నారు. ఆ అంచనాలను రీచ్ అవుతూనే లేటెస్ట్ టీజర్ గ్లింప్స్ లో డార్లింగ్ లుక్స్ కానీ మేకర్స్ విడుదల చేసిన లేటెస్ట్ పోస్టర్స్ లో కానీ చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు. ఈ విషయంలో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ఒకరకంగా కాస్త హ్యాపీ గానే ఉన్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు