గోపీచంద్, మారుతీల ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

గోపీచంద్, మారుతీల ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Feb 13, 2021 4:00 PM IST

మన టాలీవుడ్ మోస్ట్ అండర్ రేటెడ్ టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ అంటే జెనరల్ ఆడియెన్స్ లో మంచి ఇంపాక్ట్ ఉంది. అయితే మరి ఇప్పుడు గోపీచంద్ హీరోగా నటిస్తున్న “సీటీమార్” విడుదలకు రెడీ అవుతున్న సమయంలోనే హిట్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను ఓకే చేసేసారు. మరి అలాగే దీనికి ఆల్రెడీ అంటే డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.

అయితే ఇప్పుడు ఈ కాంబో మరో ఆసక్తికర అప్డేట్ ను రివీల్ చేశారు. ఈ చిత్రం తాలూకా టైటిల్ ను రేపు పూజా కార్యక్రమంతో రివీల్ చేస్తున్నట్టుగా ఓ వినూత్న పోస్టర్ డిజైన్ చేసి కన్ఫర్మ్ చేశారు. కమెర్షియల్ అనే పదాన్ని హైలైట్ చేస్తూ రేపు ఉదయం 8 గంటల 300 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు. మరి ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు