‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తయ్యేది అప్పుడే !

‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తయ్యేది అప్పుడే !

Published on Feb 8, 2021 7:19 PM IST


నేషనల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మార్చి సెకెండ్ వీక్ కి పూర్తీ అవుతుందని తెలుస్తోంది. ఆల్ రెడీ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలైన సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ సినిమాలో వచ్చే మెయిన్ ‘బిజియమ్ బీట్’ సినిమా మొత్తంలోనే హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది.

పైగా కీరవాణి కెరీర్ లోనే ఈ బిజియమ్ బిట్ బెస్ట్ అవుతుందట. ఇక రాజమౌళి ముందుగానే ప్రకటించినట్లుగా ‘ఆర్ఆర్ఆర్’ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం, చరణ్ అల్లూరి పాత్రల్లో కనిపించబోతున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఇక ‘బాహుబలి’ తరవాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారీ అంచనాలు భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు