యంగ్ హీరో కీటోడైట్‌ చేస్తున్నాడట !

యంగ్ హీరో కీటోడైట్‌ చేస్తున్నాడట !

Published on Feb 8, 2021 10:25 AM IST

‘కృష్ణ అండ్‌ హీజ్‌ లీలా’ సినిమాతో హీరోగా హిట్ అందుకున్న యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యాడు. ఈసారి నేహాశెట్టితో కలిసి ఆయన ‘నరుడి బ్రతుకు నటన’లో నటిస్తున్నాడు. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ చిన్న వీడియోను చిత్రబృందం పంచుకుంది.

కాగా ‘జిమ్‌ గట్టిగా చేస్తున్నట్టున్నవ్‌గా అని హీరోను అడగ్గా.. లేదు కీటోడైట్‌ చేస్తున్నా అని చెప్పి. ఆ తర్వాత అద్దం ముందు నిల్చొని కండలు చూసుకొని మురిసిపోతుంటాడు’. మొత్తానికి ఈ వీడియో ఆసక్తికరంగా ఉంది. కాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల తొలి పూజా కార్యక్రమం ఘనంగా చేసుకొని ఈ సినిమా చిత్రీకరణ ప్రసుతం శరవేగంగా జరుగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు