తోడేలు సీక్వెన్స్ కోసం బన్నీ సిద్ధం !

తోడేలు సీక్వెన్స్ కోసం బన్నీ సిద్ధం !

Published on Feb 8, 2021 8:00 AM IST

అల్లు అర్జున్ చేస్తున్న కొత్త చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా కోసం బన్నీ తోడేలు ఫైట్ నేర్చుకుంటున్నాడట. ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం తోడేలులా పరిగెత్తాలని, అలాగే తోడేలులా దాడి చేయాలని ప్రస్తుతం బన్నీ ఈ సీక్వెన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి సుకుమార్, ఈ ఫైట్ ను ఎలా కొత్తగా ప్లాన్ చేశాడో. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడే సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.

ఫస్ట్ లుక్ లో బన్నీ అడవి నేపథ్యంలో పూర్తి రఫ్ లుక్ లో అదిరిపోయేలా ఉన్నాడు. ఈ సినిమా చిత్రీకరణను ఎక్కువగా అడవుల్లోనే జరపాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాలో బన్నీ రెడ్ శాండల్ స్మగ్లర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్యారెక్టర్ కోసం కంప్లీట్ డీగ్లామర్ లుక్ లోకి మారిపోయాడు బన్నీ. భారీ బడ్జెట్ కేటాయించి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లేటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ రష్మీక కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు