ఇళయ థలపతి విజయ్ హీరోగా మాళవికా మోహనన్ హీరోయిన్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ రోల్ లో లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించిన పవర్ ప్యాకెడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “మాస్టర్”. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం మొత్తానికి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి అన్ని చోట్లా కూడా సాలిడ్ వసూళ్లను అందుకుంది.
అయితే థియేట్రికల్ రన్ ఇంకా 20 రోజులు పూర్తి కాక ముందే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి అందులో కూడా భారీ రెస్పాన్స్ ను అందుకున్న ఈ చిత్రం నుంచి డిలీటెడ్ సీన్స్ ను ప్రైమ్ వీడియో వారు నిన్న విడుదల చెయ్యగా వాటికి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది.
ముఖ్యంగా లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని రిఫరెన్స్ అలాగే స్టూడెంట్స్ తో ఎపిసోడ్ కు మంచి కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి సీన్ ను ఎందుకు తీసేసారో అని ఈ సీన్ ను చూసిన వారు అంటున్నారు. అయితే ఇది లేకుండానే సినిమా దగ్గరగా 3 గంటలకు వచ్చింది. ఒకవేళ ఉండి ఉంటే ఆ 3 గంటలు కూడా దాటి ఉండేది. మొత్తానికి మాత్రం ఈ సీన్ సోషల్ మీడియాలో అదరగొడుతుంది.