కోరిక తీరకుండానే సినిమాలకు గుడ్ బై చెప్పిన సూపర్ స్టార్

కోరిక తీరకుండానే సినిమాలకు గుడ్ బై చెప్పిన సూపర్ స్టార్

Published on Dec 24, 2012 12:02 PM IST

Krishna

‘గూడాచారి 117’ అన్నా, ‘మోసగాళ్ళకు మోసగాడు’ అన్నా, కత్తుల రత్తయ్య’ అన్నా ‘అల్లూరి సీతారామరాజు’ అన్నా వినిపించే ఏకైక పేరు సూపర్ స్టార్ కృష్ణ. అలాంటి కృష్ణ గారు సినిమాలకు గుడ్ బై చెప్పారు, ఇది ఆయన ఫ్యాన్స్ కి ఎంతో బాధాకరమైన విషయం. కృష్ణ గారు ఆయన సతీమణితో కలిసి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. మీడియాతో మాట్లాడుతూ ‘ నాకు ఎప్పటి నుంచో ఛత్రపతి శివాజీ గారి మీద నేను హీరోగా, నిర్మాతగా చేయాలని ఉండేది. కానీ ఆ కోరిక నేరవేర్చుకోకుండానే సినిమాలకు స్వస్తి చెబుతున్నాను. ఇక నటించే ఓపిక లేదు అందుకే నాకు నేనుగా రిటైర్మెంట్ తీసుకుంటున్నాను, అలాగే రాజకీయాల వైపు కూడా వెళ్ళడం లేదని’ ఆయన తెలిపారు.

తాజా వార్తలు