గోపీచంద్ నిశ్చితార్ధం పూర్తి, వేసవిలో వివాహం

గోపీచంద్ నిశ్చితార్ధం పూర్తి, వేసవిలో వివాహం

Published on Dec 24, 2012 11:50 AM IST

gopichand

యంగ్ హీరోస్ అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని అందరి పెళ్ళిళ్ళు అయ్యాయి. గోపీచంద్ వివాహం మాత్రం పలు కారణాల వల్ల ఆగిపోయింది. గోపీచంద్ కూడా ఎట్టకేలకు ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. నిన్న ఆదివారం గోపీచంద్ నిశ్చితార్ధం జరిగింది. శ్రీకాంత్ మేనకోడలు రేష్మతో గోపీచంద్ వివాహం ఖరారైన వివాహం తెలిసిందే. వీరి నిశ్చితార్ధం బందువుల సమక్షంలో జరిగింది. ఈ వేడుకకు బి. గోపాల్, వి. ఆనంద్ ప్రసాద్, ముత్యాల సుబ్బయ్య పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. వచ్చే ఏడాది వేసవిలో మే నెలలో వీరి వివాహం జరగనుంది. వివాహ తేదీ ఇంకా ఖరారు చేయలేదు.

123తెలుగు తరపున గోపీచంద్, రేష్మ లకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము.

తాజా వార్తలు