వేగంగా కోలుకుంటున్న మనీషా కొయిరాల

వేగంగా కోలుకుంటున్న మనీషా కొయిరాల

Published on Dec 23, 2012 5:46 PM IST

Manisha-Koirala
అందాలా భామ మనీషా కొయిరాల ఒవెరియన్ కాన్సర్ కి న్యూ యార్క్ సిటీలో చికిత్స పొందుతోందని మేము ఇది వరకు తెలిపాము. 42 సంవత్సరాల మనీషా సర్జరీ తర్వాత వేగంగా కోలుకుంటోంది. మనీషా ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి తన మేనేజర్ తెలియజేస్తూ ‘ ప్రస్తుతం మనీషా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సర్జరీ తర్వాత తనని హోటల్ కి తీసుకొచ్చేసాము కానీ ఇక్కడే మరో మూడు నెలలు ఉండాలి. ప్రస్తుతం ఇస్తున్న ట్రీట్మెంట్ కి మనీషా చాలా వేగంగా కోలుకుంటోందని’ తెలిపింది. నవంబర్ 28న నేపాల్ లోని తన స్వగృహంలో కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ముంబైలోని జస్లాక్ హాస్పిటల్లో జాయిన్ చేసారు . మనీషా త్వరగా పూర్తి ఆరోగ్యవంతురాలు కావాలని కోరుకుందాం.

తాజా వార్తలు