కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సూపర్ మచ్చి’. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ ను ఎత్తివేశాక ఈ సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోస్‌లో పూర్తి చేసిన సంగతి తెలిసిందే. హీరో హీరోయిన్లు కల్యాణ్‌దేవ్, రచితా రామ్‌తో పాటు ఒక కీలక పాత్ర చేస్తున్న అజయ్ పై కొన్ని ప్రధాన సన్నివేశాలు షూట్ చేశారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం కల్యాణ్ దేవ్ ఈ సినిమా కోసం తన డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు.
ఇక కల్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నే ప్రయత్నం చేశాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కళ్యాణ్ దేవ్ మాత్రం నటనలో మంచి ప్రతిభను కనబరిచాడు. ప్రస్తుతం ‘కళ్యాణ్ దేవ్’ నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో తన రెండువ సినిమాని చేస్తున్నాడు. ఈ చిత్రం రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.