పూర్తయిన “ఒక అమ్మాయితో”… కోవిడ్ టైమ్ కహానీ షూట్.!

పూర్తయిన “ఒక అమ్మాయితో”… కోవిడ్ టైమ్ కహానీ షూట్.!

Published on Sep 19, 2020 8:37 AM IST

ఈ ఏడాది వచ్చిన కరోనా వైరల్ మూలాన ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ వైరల్ ఎంత ప్రమాదకరం అయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ విభాగం వారు కూడా దీనిని వదల్లేదు. సోషల్ మీడియాలో మీమ్స్ నుంచి ఇప్పుడు సినిమాలు వరకు కూడా వచ్చేసాయి. అలా ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై మురళి బోడపాటి దర్శకత్వంలో తాజా చిత్రం తెరకెక్కించిన చిత్రం “ఒక అమ్మాయితో”.

కోవిడ్ టైం కహానీ” అనే కాప్షన్ తో వస్తున్న ఈ చిత్రాన్ని గార్లపాటి రమేష్, డా౹౹వి.భట్ నిర్మాతలుగా నిర్మిస్తున్న చేస్తున్నారు. కరోనా టైం లో 42 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇటీవలనే టాకీ పార్ట్ పూర్తయినట్టు దర్శక, నిర్మాతలు తెలిపారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా, ఎవరికి ఏమీ జరగకుండా సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తిచేయడం ఒక రికార్డ్ గా చెబుతున్నారు. పూర్తి జాగ్రత్తలతో సినిమా నిర్మాణం పూర్తి చేసినట్లు నిర్మాతలు తెలిపారు.

తాజా వార్తలు