“పుష్ప”కు బన్నీ మేకోవర్ ను గమనించారా?

“పుష్ప”కు బన్నీ మేకోవర్ ను గమనించారా?

Published on Sep 13, 2020 1:00 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. తన ప్రతీ సినిమాకు కూడా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకొనే బన్నీ ఈ చిత్రానికి కూడా ఒక సరికొత్త లుక్ లో దర్శనం ఇచ్చి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఈ సినిమాకు బన్నీ ప్రిపేర్ చేసిన ఈ కొత్త లుక్ ఇప్పుడు క్రమంగా బన్నీ పాత రోజులనే గుర్తు చేస్తుంది.

పైగా ఇక్కడ సరిగ్గా గమనిస్తే ఇంతకు ముందు సుకుమార్ తో చేసిన “ఆర్య 2” లుక్కే గుర్తుకు రాక మానదు. లేటెస్ట్ గా బయటకొచ్చిన బన్నీ ఫోటోలు చూస్తే 2009లో ఇదే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన “ఆర్య 2” చిత్రంలో రింగుల జుట్టుతో కనిపించే బన్నీయే గుర్తుకు వస్తాడు. ఇలా తాను చేస్తున్న లేటెస్ట్ చిత్రానికి ఆల్రెడీ అదే దర్శకునితో చేసిన లుక్ లోనే మళ్ళీ కనిపించడం ఒకరకంగా యాదృచ్చికమే అని చెప్పాలి. ఈ భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణ సారధ్యం వహిస్తున్నారు.

తాజా వార్తలు