“ఆదిపురుష్” కు ప్రభాసే ఎందుకు.?దర్శకుని సమాధానం!

“ఆదిపురుష్” కు ప్రభాసే ఎందుకు.?దర్శకుని సమాధానం!

Published on Sep 13, 2020 10:19 AM IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూడు భారీ ప్రాజెక్టులలో “ఆదిపురుష్” కూడా ఒకటి. ఈ చిత్రాన్ని మాత్రం దర్శకుడు ఓం రౌత్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. అయితే బాలీవుడ్ లో కూడా ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు ఇతర ఇండస్ట్రీలలో కూడా ఎందరో స్టార్ హీరోలు ఉన్నారు కానీ ఈ ఆదిపురుష్ లాంటి ఇతిహాస గాథకు ప్రభాసే ఎందుకు అంటే దానికి ఓంరౌత్ దగ్గర సమాధానం ఉందట.

ప్రభాస్ బాహుబలి తో ఒక్కసారిగా హిందీ ప్రేక్షక జనాన్ని కూడా ఆకర్షించాడు. కానీ ఓంరౌత్ కు మాత్రం కేవలం ప్రభాస్ ఒక్క హీరోగా, వ్యక్తిగా నచ్చడం వలనే తన సినిమాలో తీసుకోవడం కాకుండా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, అతని తీక్షణమైన కళ్ళు తనకి ఈ పాత్రకు తప్ప ఇంక మరెవరు సూట్ అవ్వరని అనిపించేలా చేశాయట అందుకే ఈ సినిమాకు వన్ ఓన్లీ ఆప్షన్ గా ప్రభాస్ పేరునే అనుకున్నానని ఓంరౌత్ అంటున్నారట. దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో 3డి టెక్నాలజీలో మొత్తం 5 భాషల్లో విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు