“వి” సెట్స్ లో సుధీర్ బాబు స్టన్నింగ్ వర్కౌట్ చూసారా.!

“వి” సెట్స్ లో సుధీర్ బాబు స్టన్నింగ్ వర్కౌట్ చూసారా.!

Published on Sep 13, 2020 9:03 AM IST

నాచురల్ స్టార్ నాని మరియు సుధీర్ బాబు లు మెయిన్ లీడ్స్ లో నటించిన లేటెస్ట్ చిత్రం “వి”. నివేతా థామస్ మరియు అదితి రావ్ హైదరీలు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని ఫుల్ ఆన్ క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. అయితే ఈ సెప్టెంబర్ 5 నుంచి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ డిజిటల్ ప్రీమియర్ గా విడుదలయింది.

అయితే ఈ చిత్రానికి అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు. కానీ మెయిన్ లీడ్స్ లో కనిపించిన నాని మరియు సుధీర్ బాబులను మాత్రం మెచ్చుకోకుండా ఎవరూ ఉండలేకపోయారు. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్ లోనే సుధీర్ బాబుపై ప్లాన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ ఎంట్రీ సీన్ అని చెప్పొచ్చు.

సిక్స్ ప్యాక్ లో లుక్ కనిపించి స్టన్ చేసిన సుధీర్ బాబు ఆ సీన్ కు ముందు ప్రిపేర్ అయిన ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఓ ఎగ్జామ్ రాయడానికి ముందు ఎలా ప్రిపేర్ అవుతారో అలా తాను కూడా ఆ సీన్ కోసం రెడీ అయ్యానని రెండు డంబుల్స్ పట్టుకొని వర్కౌట్ చేస్తున్న ఫోటోలు పెట్టారు.

తాజా వార్తలు