ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూడు భారీ ప్రాజెక్టులలో ప్రతీ దానిపై కూడా తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా హిందీ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్న భారీ ప్రాజెక్ట్ “ఆదిపురుష్” పై సెపరేట్ అంచనాలు ఉన్నాయి. రామాయణ గాథపై తెరకెక్కనున్న ఈ మోస్ట్ ఎక్స్ పెన్సివ్ ప్రాజెక్ట్ లో రామునిగా ప్రభాస్ కనిపించనున్నాడు.
అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణునిగా కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రానికి అవసరం అయితే ఎంతైనా ఖర్చు చేసేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మరో బజ్ వినిపిస్తుంది. ఈ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ గా నిలవనున్న విఎఫ్ఎక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోనున్నారట.
చాలా వరకు ఈ చిత్రాన్ని కేవలం విఎఫ్ఎక్స్ మాయాజాలంతోనే కనీ వినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నట్టు చేయనున్నారట. అందుకు తగ్గట్టుగా దర్శకుడు ఓం రౌత్ ముందే ప్రీ విజువల్స్ ను ప్లాన్ చేస్తున్నారట. దీనితో బయట స్పాట్స్ లో తక్కువ షూట్ ఉన్నప్పటికి అత్యున్నత ప్రామాణాలతో ఈ చిత్రం భారీ విజువల్ ట్రీట్ లా ఉండనుంది అని తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం ఊహలకు మించిన రేంజ్ లో ఉండడం ఖాయం అని చెప్పాలి.