టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మేకోవర్ సోషల్ మీడియాలో చిన్నపాటి సెన్సేషన్ ను రేపింది. అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించిన మహేష్ ఒక్కసారిగా అందరినీ స్టన్ చేసి వదిలేసారు. అయితే ఇప్పుడు మహేష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” లో కూడా మహేష్ ఇదే లుక్ లో కనిపిస్తారని అంతా అనుకుంటున్నారు.
కానీ బహుశా అందుకు చాన్సులు తక్కువ ఉండొచ్చని చెప్పాలి. ఎందుకంటే “సర్కారు వారి పాట”లో మహేష్ ఫుల్ ఆన్ మాస్ లుక్ లో కనిపించనున్నారు. పైగా మహేష్ లేటెస్ట్ లుక్ కూడా కేవలం యాడ్ షూట్ కోసం మాత్రమే డిజైన్ చెయ్యబడి ఉంది. అలాగే సర్కారు వారి పాట ప్రీ లుక్ లోనే మహేష్ నయా హైర్ స్టైల్ ఎలా ఉంటుందో కూడా అర్ధం అయ్యింది.
సో వీటన్నిటినీ చూస్తుంటే సర్కారు వారి పాట షూట్ టైం కి మహేష్ మళ్ళీ పాత లుక్ కి వచ్చేయడం ఖాయం అని చెప్పాలి. కాకపోతే ఏఈ చిత్రంలో మహేష్ రెండు షేడ్స్ లో కనిపిస్తారని మరో రూమర్ కూడా ఉంది, మరి మహేష్ ఇదే లుక్ ను మైంటైన్ చేస్తారా లేక మారుస్తారా అన్నది చూడాలి. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.