మన టాలీవుడ్ లో ఉన్న సూపర్బ్ పాన్ ఇండియన్ కటౌట్స్ లలో డార్లింగ్ హీరో ప్రభాస్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు ముఖ్యులు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు నిజ జీవితంలో కూడా మంచి స్నేహితులు అయితే ఈ ఇద్దరు కలిసి ఈ టైం లో ఒక సినిమా కానీ చేస్తే దాని ఇంపాక్ట్ ఊహాలకు అందని రేంజ్ లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కుదురుతుందో ఏమో కానీ ఈ ఇద్దరి పాన్ ఇండియన్ హీరోల ఫాన్స్ మాత్రం ట్విట్టర్ లో దుమ్ము రేపుతున్నారు.
ఈ మధ్య కాలంలో ట్విట్టర్ ట్రెండ్స్ హోరెత్తుతున్నాయి. కానీ అనుకోకుండా ఇపుడు ఈ ఇద్దరి హీరోలు ప్లాన్ చేసుకున్న ట్రెండ్ లు ట్విట్టర్ లో దుమ్ము రేపుతున్నాయి. అయితే ఈరోజుతో ప్రభాస్ నటించిన లాస్ట్ చిత్రం “సాహో” 1 ఏడాది పూర్తి చేసుకోవడంతో ట్రెండ్ తో వారు మిలియన్స్ లో ట్వీట్లు వేస్తుండగా అల్లు అర్జున్ అభిమానులు అన్ అకేషనల్ ట్రెండ్ గా ప్లాన్ చేసిన ట్రెండ్ తో వారు మరోపక్క దుమ్ము లేపుతున్నారు. ఇద్దరు హీరోల అభిమానాలు పదేసి మిలియన్ ట్వీట్ల దిశగా వెళ్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోలు పలు పాన్ ఇండియన్ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు.