యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నటిస్తున్న చిత్రాలలో ప్రభాస్ అభిమానులు ఎక్కువగా ఎదురు చూస్తున్న వాటిలో మాత్రం నాగశ్విన్ తో చేస్తున్న సినిమా అని చెప్పాలి. ఇప్పటికే భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాత అశ్విని దత్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కొంచెం కొత్త కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి.
టాలెంటెడ్ హీరోయిన్ నివేతా థామస్ ఒక కీ రోల్ చేయనుంది అని బజ్ వినిపించింది. ఇపుడు దీనితో పాటు మరో నయా రూమర్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ కోసం ఇప్పుడు యువతలో సెన్సేషన్ రేపిన హీరోయిన్ నిధి అగర్వాల్ పేరు వినిపిస్తుంది. నాగశ్విన్ స్పెషల్ గా ఆమె పేరునే ఎన్నుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ అంశంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే నటిస్తుండగా ఈ భారీ ప్రాజెక్ట్ ను 2022 కు ప్లాన్ చెయ్యనున్నారు.