పవన్ నుంచి డబుల్ ట్రీటా? ట్రిపుల్ ట్రీటా..?

పవన్ నుంచి డబుల్ ట్రీటా? ట్రిపుల్ ట్రీటా..?

Published on Aug 30, 2020 9:04 AM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు ప్రాజెక్టులను చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా అయితే మొత్తం మూడు ప్రాజెక్టు లు పవన్ లైన్ లో ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇపుడు సెప్టెంబర్ 2వ తారీఖు వస్తుండడంతో పవన్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ లేపేందుకు సన్నద్ధం అవుతున్నారు.

అయితే పవన్ ఇప్పుడు ఒప్పుకున్న మూడు చిత్రాలలో మాత్రం వేణు శ్రీరామ్ మరియు క్రిష్ లతో చేస్తున్న ప్రాజెక్టు లకు సంబంధించి పవన్ పుట్టినరోజు కానుకగా ఒక్కో గిఫ్ట్ రానుంది అని గట్టి బజ్ వినిపిస్తోంది. ఇక ఇదే డబుల్ ఫీస్ట్ అనుకుంటే అదే రోజున మరో సర్ప్రైజ్ ఉండనుంది అని గట్టి టాక్ వినిపిస్తోంది.

పవన్ కు అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందించిన హరీష్ శంకర్ సినిమా కు సంబంధించి కూడా ఒక అప్డేట్ రానుంది అని సినీ వర్గాల్లో ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇదే కనుక నిజం అయితే ఈసారి పవన్ పుట్టినరోజుకు ఫీస్ట్ ట్రిపుల్ కానుంది అని చెప్పాలి.

తాజా వార్తలు