‘సర్కారు వారి పాట’ టీమ్ కి మహేష్ విజ్ఞప్తి !

‘సర్కారు వారి పాట’ టీమ్ కి మహేష్ విజ్ఞప్తి !

Published on Aug 30, 2020 12:18 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా ‘సర్కారు వారి పాట’. కాగా ఈ సినిమా షూట్ ఇంకా ప్రారంభించలేదు. ప్రసుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లోనే ఉంది. అయితే ఈ చిత్రం మేకర్స్ మాత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. షూటింగ్ ప్రారంభించే నాటికి మొత్తం ఆల్బమ్‌ రెడీ చేయాలని.. సినిమా అవుట్ ఫుట్ అది ఎంతగానో ఉపయోగపడుతుందని.. కాబట్టి ఆల్బమ్ ని పూర్తి చేయాలని మహేష్, పరశురామ్‌ ని తమన్ ను కోరినట్లు తెలుస్తోంది. అందుకే వాళ్ళు ఆల్బమ్ పూర్తి చేసేపనుల్లో ఉన్నారు.

కాగా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడట. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, అనే అంశాల చుట్టూ సినిమా నడుస్తోందని తెలుస్తోంది.

అలాగే నేటి రాజకీయ నేపథ్యం కూడా ఎంచుకున్నారని.. సినిమాలో రాజకీయాలను ప్రస్తావించబోతున్నారని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీ ను నిర్మిస్తున్నాయి.

తాజా వార్తలు