విజయ్ ఖాతాలో ఫస్ట్ ఎవర్ ఇండియన్ రికార్డు.!

విజయ్ ఖాతాలో ఫస్ట్ ఎవర్ ఇండియన్ రికార్డు.!

Published on Aug 29, 2020 8:04 AM IST

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఇపుడు పూరీతో కలిసి ఒక పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ దీని ముందే హిందీ మినహా మిగతా కేఈల్క భాషల్లో కూడా అడుగు పెట్టిన చిత్రాలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది “డియర్ కామ్రేడ్”. విజయ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఎన్నో అంచనాల నడుమ విడుదల కాబడిన ఈ చిత్రం ఊహించని పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ తర్వాత మాత్రం ఈ క్రేజ్ వచ్చింది.

ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇప్పుడు మన ఇండియాలోనే ఒక ఫస్ట్ ఎవర్ రికార్డును కొట్టిన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం తాలూకా హిందీ వెర్షన్ ను యూట్యూబ్ లో వదలగా దానికి ఇప్పుడు 2 మిలియన్ లైక్స్ వచ్చి పడ్డాయి. దీనితో ఈ చిత్రం మొట్టమొదటి సారి 2 మిలియన్ లైక్స్ అందుకున్న దానిగా రికార్డు నెలకొల్పింది. అది కూడా కేవలం 7 నెలల్లోనే 160 మిలియన్స్ తో ఈ ఫీట్ ను అందుకోవడం గమనార్హం. ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహించగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.

తాజా వార్తలు