బన్నీ – కొరటాల ప్రాజెక్ట్ కు కూడా అతనేనా?

బన్నీ – కొరటాల ప్రాజెక్ట్ కు కూడా అతనేనా?

Published on Aug 29, 2020 7:03 AM IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రెండు భారీ ప్రాజెక్టులు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ రెండు చిత్రాలు కూడా పాన్ ఇండియన్ ప్రాజెక్టులు గానే తెరకెక్కనున్నాయి. అయితే మొదట సుకుమార్ తో తీస్తున్న “పుష్ప” అనంతరం తన 21 వ చిత్రం కొరటాల తో మొదలు కానుంది.

ఈ కాంబోలో మొదటి చిత్రం కావడంతో ఈ సినిమా పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవలె కొన్ని రోజుల కితమే జస్ట్ అనౌన్సమెంట్ పోస్టర్ తో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని తెలిపారు తప్పితే ఇతర క్యాస్టింగ్ కానీ సాంకేతిక విభాగానికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలియజేయలేదు. అయితే ఏఈ చిత్రానికి సంబంధించి ఒక బజ్ వినిపిస్తుంది.

ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ తో “ఆచార్య” చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కు సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సౌండింగే మూవీ మరియు సంగీత ప్రియులకు ఎంతో ఇంపుగా అనిపించింది. ఈ చిత్రం తర్వాత బన్నీతో చేయబోయే సినిమాకు కూడా మణిశర్మనే కొరటాల తీసుకునే అవకాశాలు ఉన్నాయని బజ్ వినిపిస్తుంది. మరి దీనిపై అసలైన క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా వార్తలు