దాదాపు ఒక దశాబ్దం తర్వాత హీరోగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా మళ్ళీ వెండి తెరకు పరిచయం కావడం ఒకెత్తు అయితే ఆ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణే కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ పేరిట నిర్మాణం వహించారు. అలాగే దాని తర్వాత కూడా సైరా లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని కూడా చరణ్ తీశారు.
ఒకపక్క హీరోగా మరోపక్క నిర్మాతగా కూడా చరణ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే రామ్ చరణ్ కు మాత్రం తన కెరీర్ ను ఉద్దేశించి తండ్రి మెగాస్టార్ చిరంజీవి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది. చరణ్ ను ప్రస్తుతానికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మాణం వహించవద్దని కొన్నాళ్ల పాటు కేవలం తన సినిమాల మీద మాత్రమే దృష్టి పెట్టాలని తెలిపారట.
అందులో భాగంగానే చరణ్ కూడా కొన్నాళ్ల పాటు భారీ చిత్రాలను నిర్మించే అవకాశం లేదు అన్నట్టు తెలుస్తుంది. కానీ వచ్చే 2021 నుంచి మాత్రం చరణ్ చిన్న పాటి బడ్జెట్ లో మంచి నాణ్యమైన చిత్రాలను ఎంచుకొని వాటిని నిర్మించే అవకాశం ఉందని తెలుస్తుంది.