కొంత కాలంగా సరైన హిట్ లేక అల్లాడుతున్న హీరో హృతిక్ రోషన్ గత ఏడాది రెండు భారీ హిట్స్ అందుకొని ఫార్మ్ లోకి వచ్చారు. 2019లో హృతిక్ విడుదల చేసిన సూపర్ 30, వార్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగించాయి. వార్ ఏకంగా 400 కోట్ల వసూళ్ల వరకు రాబట్టి 2019 హైయెస్ట్ గ్రాసింగ్ చిత్రంగా నిలిచింది. టైగర్ ష్రాఫ్ మరో హీరోగా నటించిన ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కాగా నెక్స్ట్ హృతిక్ తన సూపర్ మాన్ సిరీస్ లోని క్రిష్ 4 లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి . ఐతే ఈ మూవీకి ముందే రెండు చిత్రాలు చేయాలని హృతిక్ ఆలోచన చేస్తున్నారట. ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లో విడుదల కానున్న ఈ రెండు చిత్రాలలో ఒకటి కామెడీ మరియు మరొకటి యాక్షన్ మూవీగా ఉండాలనేది ఆయన ఆలోచనగా తెలుస్తుంది. ఇక ఈ రెండు చిత్రాల కోసం హృతిక్ కథలు వింటున్నారట.