లేట్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి చిత్రం `దిల్ బెచారా` అద్భుతాలు సృష్టిస్తోంది. ఇటీవల డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదలైన ఈ చిత్రం రికార్డ్ వ్యూస్దక్కించుకుంది. సుశాంత్ సింగ్ గౌరవార్దం అందరికీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ సంస్థ ఉచితంగా అందుబాటులో ఉంచింది. దీంతో ఈ సినిమా 24 గంటల్లో ఏకంగా తొమ్మిదిన్నర కోట్ల వ్యూస్ సాధించింది.ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ కలిగిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ ను కూడా దిల్ బెచారా దాటేసిందట.
అలాగే 10/10 ఐఎమ్డీబీ రేటింగ్ సాధించి మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. ఒకవేళ ఈ సినిమా కనుక థియేటర్లలో విడుదలై ఉంటే తొవందల కోట్ల వసూళ్లు ఈ చిత్రం సాధించేదని కొందరు అంచనా వేస్తున్నారు. ఇక సుశాంత్ సింగ్ ఆత్మ హత్య ఉదంతంలో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. ఆమె అరెస్ట్ జరిగే అవకాశం కలదని అంటున్నారు.