‘బ్యాచ్‌లర్‌’ రాక పై క్లారిటీ !

‘బ్యాచ్‌లర్‌’ రాక పై క్లారిటీ !

Published on Jun 22, 2020 8:21 PM IST

అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ఈ సినిమా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ ముగిసినా.. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్‌ అయ్యే పరిస్థితి లేదు. దాంతో ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని రూమర్స్ మొదలయ్యాయి. కాగా ఈ సినిమా విడుదల గురించి అవన్నీ రూమర్స్ అని.. ఎంత ఆలస్యమైనా తమ సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తామని చిత్ర బృందం చెబుతుంది. అయితే దసరా కానుకగా ‘బ్యాచ్‌లర్‌’ రాక ఉంటుందని టాలీవుడ్‌ లో టాక్‌ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాలో అఖిల్ – పూజా హెగ్డేల మధ్య లవ్ సీన్స్ చాల కొత్తగా ఉంటాయని, అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ కూడా చాల బాగా కుదిరిందని తెలుస్తోంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫలితం పై అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఫ్యాన్స్ సైతం అఖిల్ ఈ చిత్రంతోనైనా సాలిడ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు.

తాజా వార్తలు