బాలయ్య ‘బీబీ3′ టైటిల్ అదే !

బాలయ్య ‘బీబీ3′ టైటిల్ అదే !

Published on Jun 22, 2020 5:15 PM IST

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా రాబోతున్న సినిమా ‘బీబీ3′ పేరుతో విడుద‌ల‌ చేసిన టీజ‌ర్ ఇప్ప‌టికే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ సినిమా టైటిల్ పై మాత్రం అనేక రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ ను ఫిక్స్ చేశారని ఇటివలే మేము రివీల్ చేశాము. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం అదే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్‌ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోంది. ఒక నిమిషానికి పైగా వచ్చిన టీజర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ అండ్ దుమ్ము రేపే యాక్షన్ తో రెచ్చిపోయారు. ముఖ్యంగా పంచ కట్టులో బాలయ్య లుక్ కేకగా ఉంది. వైట్ అండ్ వైట్ లో బాలయ్య చక్కగా సరిపోయారు. సినిమాలో కూడా బాలయ్య అదే లుక్ తో కనిపిస్తారట.

ఇక బాలయ్యకు ‘సింహ’, ‘లెజెండ్’ లాంటి సూపర్ విజయాలను అందించారు బోయపాటి. కాబట్టి ఈసారి కూడా సూపర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు