వర్మ.. నిన్ను చూస్తే జాలేస్తోంది !

వర్మ.. నిన్ను చూస్తే జాలేస్తోంది !

Published on Jun 22, 2020 1:10 PM IST

కరోనా వచ్చినా.. ప్రపంచం మొత్తం కష్ట కాలంలో నలిగిపోతోన్నా.. రామ్ గోపాల్ వర్మ మాత్రం తన వివాదాస్పద సినిమాలను అలాగే కంటిన్యూ చేస్తూ.. తెరకెక్కిస్తోన్న సినిమా ‘మర్డర్’: మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ‘ప్రణయ్‌ హత్య’ నేపథ్యంలో వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పైగా ఫాదర్స్‌ డే సందర్భంగా మర్డర్ ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ ను రిలీజ్ చేశాడు. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే ప్రణయ్‌ – అమృతల ప్రేమ గాధ దగ్గర నుండి మారుతీరావు బాధ వరకూ సినిమా తీయనున్నట్టు పోస్టర్‌ చూస్తే అర్థమౌతోంది.

అయితే ఈ సినిమా పై అమృత స్పందిస్తూ.. ‘ఈ సినిమాకి నా జీవితానికి ఎక్కడా పోలికలు లేవు. ఇదంతా మా పేర్లను ఉపయోగించి వర్మ సినిమాని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. వర్మ ఇంతటి నీచానికి దిగజారుతాడని ఎప్పుడూ అనుకోలేదు. మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకు నిన్ను చూస్తే జాలేస్తోంది. ఇప్పటికే ఎన్నో బాధలను అనుభవించా. ఈ బాధ అంత పెద్దదేం కాదు. కానీ దీన్ని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. ఏడుద్దామన్నా కన్నీళ్లు రావడం లేదు. హృదయం బండబారి పోయింది. దయచేసి నా జీవితాన్ని బజారులో పెట్టొద్దు’ అని అమృత తన బాధను వ్యక్త పరిచింది. కాకపోతే ఇలాంటి బాధలని కోపాలను ఆర్జీవీ అనే జీవి పట్టించుకోరు కదా.

తాజా వార్తలు