యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం ‘చక్ర’ అనే సినిమా చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం షూటింగ్ గత సంవత్సరమే ప్రారంభమైంది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది.
అయితే, తాజాగా ఈ రోజు విశాల్ ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను తెలుగులో విశాల్ ‘చక్ర’ అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ విశాల్ ను కొత్త రీతిలో ప్రెజెంట్ చేస్తోంది. ఈ పోస్టర్ ను బట్టి ఈ చిత్రం కూడా మరో యాక్షన్ థ్రిల్లర్ గా రానుందని అర్ధం అవుతుంది.
ఎంఎస్ ఆనందన్ బాలసుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్ రెజీనా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో విశాల్ సరసన హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది.
Here we go, Presenting the Title & First Look of @VishalKOfficial’s next in Telugu, #vishalChakra@ReginaCassandra @ShraddhaSrinath @thisisysr @srushtiDange @AnandanMS15 @balasubramaniem @baraju_SuperHit @shreyasgroup @VffVishal pic.twitter.com/LIQPJ4GSPN
— Vishal Film Factory (@VffVishal) June 22, 2020