కొనసాగుతున్న తారక్ ఫ్యాన్స్ సెట్ చేసిన ట్రెండ్.!

కొనసాగుతున్న తారక్ ఫ్యాన్స్ సెట్ చేసిన ట్రెండ్.!

Published on Jun 18, 2020 10:57 PM IST

తమ అభిమాన హీరోలను తమ అభిమానులు ఏ స్థాయిలో ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తమ అభిమాన హీరో పుట్టిన రోజు వచ్చింది అంటే ఆఫ్ లైన్ అయినా ఆన్ లైన్ అయినా సరే ఒక రేంజ్లో సంబరాలు చేస్తుంటారు.

ముఖ్యంగా ఆన్ లైన్ లో అయితే ప్రతీ ఏడాది ఏదో ఒక కొత్తగా ప్లాన్ చెయ్యాలని అందరి హీరోల ఫ్యాన్స్ చేస్తుంటారు. అలా ఈసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజుకు గాను రెడీ చేసిన బర్త్ డే కామన్ డీపీ ను మొట్ట మొదటి సారిగా ఏకంగా 25 మంది సినీ ప్రముఖులతో విడుదల చేసారు.

ఆ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజుకు కూడా ఇదే ట్రెండ్ కొనసాగించారు. అది ఇప్పుడు స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వరకు వెళ్ళింది. ఈ జూన్ 19 కాజల్ పుట్టినరోజు కావడంతో మొత్తం 18 మంది సినీ తారలు కాజల్ బర్త్ డే కామన్ డీపీను విడుదల చేస్తున్నారు. మొత్తానికి తారక్ ఫ్యాన్స్ సెట్ చేసిన ట్రెండ్ ఇలా కొనసాగుతుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు