నిహారిక పెళ్లి.. అబ్బాయి ఎవరంటే?

నిహారిక పెళ్లి.. అబ్బాయి ఎవరంటే?

Published on Jun 18, 2020 4:32 PM IST

నిహారిక పెళ్ళిపై మీడియాలో ఓ బ్రేకింగ్ న్యూస్ నడుస్తుంది. నిహారికకు పెళ్లి కుదిరిందట. ఆమె గుంటూరుకు చెందిన ఓ గవర్నమెంట్ అధికారి కొడుకుని వివాహం చేసుకోనుందట. దీనిపై త్వరలోనే అధికారిక వార్త రానున్నట్లు గట్టిగా వినిపిస్తుంది. కొద్దిరోజుల క్రితం నాగబాబు నిహారిక పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. అది కూడా ఈ ఏడాది చివరి కల్లా పెళ్లి చేయాలని నిర్ణయించినట్టు స్పష్టత ఇచ్చారు.

దీనితో బయటకి వచ్చిన వార్త నిజమే అన్న వార్త వినిపిస్తుంది. అలాగే నేడు నిహారిక సోషల్ మీడియాలో తన పెళ్లి గురించి ఓ ఫోటో ద్వారా హింట్ ఇచ్చింది. ఇక ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక రెండు మూడు తెలుగు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. పింక్ ఎలిపెంట్ అనే నిర్మాణ సంస్థ స్థాపించి కొన్ని వెబ్ సిరీస్ లు కూడా చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు