ఎదురుదాడికి దిగిన స్టార్ హీరో తమ్ముడు..!

ఎదురుదాడికి దిగిన స్టార్ హీరో తమ్ముడు..!

Published on Jun 18, 2020 11:16 AM IST

బాలీవుడ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ రెండు రోజుల క్రితం సల్మాన్ మరియు అతని కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన కెరీర్ ఆ కుటుంబం కారణంగా నషేనం అయ్యిండి అంఐ ఆయన బాధపడ్డారు. ఇక సల్మాన్ అతని తమ్ముళ్లు మాఫియా అండతో బెదిరింపులకు దిగేవారని ఆయన ఆరోపించారు. అలాగే తన చిత్రం బేషరం విడుదల కాకుండా చేయడానికి కుట్ర పన్నారని ఆయన చెప్పడం జరిగింది.

అభినవ్ తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ స్పందించారు. నన్ను నా సోదరులు సల్మాన్‌ ఖాన్‌, సోహైల్‌ ఖాన్‌, మా తండ్రి సలీం ఖాన్‌లపై కశ్యప్‌ తప్పుడు ప్రచారం చేస్తూ…కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తున్నాడని అసహనం వ్యక్తం చేశారు. అలాగే తనపై మేము చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం’ అని చెప్పాడు. అభినవ్‌ దర్శకత్వం వహించిన దబంగ్ ‌లో నేను, సల్మాన్ నటించాం. సీక్వెల్‌గా వచ్చిన దబంగ్ 2 నుంచి అభినవ్‌ తప్పుకున్నాడు. ఆ రోజు నుండి మాకు అభినవ్‌కి మాటలు లేవు. అయినప్పటికీ అభినవ్ ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడో తెలియడం లేదని అభినవ్ పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు