ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు కానీ..కష్టమేనట..!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు కానీ..కష్టమేనట..!

Published on Jun 17, 2020 7:14 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన్ని తెరపై బాగా మిస్సవుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ కారణంగా ఆయన ఇప్పటికే 2019ని ఒక్క సినిమా కూడా విడుదల చేయకుండా ముగించాల్సివచ్చింది. ఇక ఆర్ ఆర్ ఆర్ విడుదల 2020 నుండి 2021కి వాయిదాపడిన నేపథ్యంలో ఎన్టీఆర్ కి కెరీర్ లో మొదటిసారి రెండేళ్ల గ్యాప్ వచ్చింది. ఐతే ఈ లోటు పూడ్చడానికి 2021లో ఎన్టీఆర్ నుండి అతి తక్కువ గ్యాప్ లో రెండు సినిమాలు విడుదల అవుతాయని సమాచారం రావడం జరిగింది.

ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ తో ఓ మూవీ కమిట్ కాగా ఆ మూవీ షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్ లో మెదలుకావాల్సింది. ఆర్ ఆర్ ఆర్ మరియు త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ఏక కాలంలో పూర్తి చేసి 2021 జనవరిలో ఆర్ ఆర్ ఆర్, సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో త్రివిక్రమ్ మూవీ విడుదల చేయాలన్నది ప్రణాళికగా పెట్టుకున్నారు. ఐతే కరోనా కారణంగా ముందుగా అనుకున్న ప్రణాళికలు తారుమారయ్యాయి. కఠిన పరిస్థితులు నెలకొన్న సమయంలో రెండు సినిమాలలో ఏక కాలంలో షూటింగ్ లో పాల్గొనే పరిస్థితి లేదు.

ఆర్ ఆర్ ఆర్ తర్వాత లేదా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చివరి దశకు వచ్చాక త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్లే సూచనలు కలవు. కావున 2021లో ఫ్యాన్స్ ఆశిస్తున్నట్లు ఎన్టీఆర్ నుండి రెండు చిత్రాలు రావడం కష్టమేనట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు