టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన హిట్ చిత్రాల్లో “టాక్సీ వాలా” కూడా ఒకటి. ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన మన తెలుగు హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ మంచి మార్కులే కొట్టేసింది.
ఆ టైం యూత్ కి హార్ట్ త్రోబ్ గా కూడా మారిపోయింది. అయితే ఇప్పుడు ఓ తెలుగు చిత్రంతో పాటుగా తమిళ్ లో హీరో సిద్దార్థతో పాటు తన తమిళ్ డెబ్యూ కు రెడీ అవుతుంది. ఇదిలా ఉండగా ఈ అమ్మడు ఈ లాక్ డౌన్ లో ఓ కొత్త పని నేర్చుకుంటుందట.
అంత సీరియస్ గా ఏం నేర్చుకుంటుందో తెలుసా? వంట. అవును ఈ లాక్ డౌన్ లో యూట్యూబ్ వీడియోస్ ద్వారా నేర్చుకోడానికి ప్రయత్నిస్తోందట. అలా తాను నేర్చుకున్న వంటకాల్లో చికెన్ బిర్యానీ అదిరిపోయేలా చేస్తా అని ఈ అమ్మడు గర్వంగా చెప్తుంది.