యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. మే 20న తారక్ బర్త్ డే రోజున తారక్ పాత్ర మీద జక్కన్న ఎలాంటి వీడియోను రిలీజ్ చేయనున్నాడో అని గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తారక్ బర్త్ డే స్పెషల్ గా ఎలాంటి వీడియోని గాని ఫస్ట్ లుక్ గాని రిలీజ్ చేయట్లేదని చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది.
కరోనా కారణంగా వర్క్ మొత్తం ఆగిపోయిందని.. ఏదో రిలీజ్ చేయాలి కదా అని ఏదొకటి రిలీజ్ చేయడం తమకు ఇష్టం లేదని, అద్భుతమైన అవుట్ ఫుట్ తోనే మీ ముందుకు వస్తామని టీమ్ స్పష్టం చేసింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశకి గురి కాకతప్పదు.
ఇక ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ ఆలియా భట్ చరణ్ సరసన, అలాగే ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడానికి బలంగానే ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.