గతేడాది ‘ఏబిసిడి’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు అల్లు శిరీష్. ఈ చిత్రం పర్వాలేదనే విజయాన్ని అందుకుంది. అయితే లాక్ డౌన్ తరువాత కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడు శిరీష్. అన్ని పనులు పూర్తై సినిమా ఈ పాటికే మొదలవ్వాల్సింది. కానీ కరోనా దెబ్బకు సినిమా వాయిదాపడింది.
ఇక గుడ్ ఎంటెర్టైనర్ ఆన్ ది వే అని ఇటీవలే శిరీష్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు అప్ డేట్ ఇచ్చాడు. ‘ఏబిసిడి’ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న శిరీష్ అన్ని వర్గాల ప్రేక్షకులకి దగ్గరవ్వాలనే ఉద్దేశ్యతో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ కథను చూజ్ చేసుకున్నారని అర్థమవుతోంది.
మరి ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు, నటించబోయే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు లాక్ డౌన్ తర్వాతే తెలియనున్నాయి.