తమిళ హీరోలు మన పరిశ్రమ మార్కెట్ మీద ప్రభావం చూపడం చాలా రోజులుగా జరుగుతున్నదే రజినీ కాంత్ చిత్రం ఇక్కడ విడుదల అవుతుంది అంటే పెద్ద హీరో విడుదలకి ఉన్న సందడి జాబితాలోకి విక్రం, సూర్య మరియు కార్తి వచ్చి చేరారు. తాజాగా “తుపాకి” చిత్ర విజయంతో విజయ్ కూడా ఇక్కడ మార్కెట్ మీద పట్టు సాదించారు. కానీ మన టాలీవుడ్ హీరోలు తమిళ ఇండస్ట్రీ మీద పట్టు కాస్త తక్కువనే చెప్పాలి. మహేష్ బాబు చిత్రాలకు అక్కడ మంచి ఓపెనింగ్స్ ఉంటాయి కానీ ప్రస్తుతం అయన బ్రాండ్ వాల్యూ అక్కడ పెరుగుతూ ఉన్నట్టు తెలుస్తుంది. గతేడాది మణిరత్నం చిత్రంలో మహేష్ బాబు నటించాల్సి ఉంది, ఆ చిత్రం పలు కారణాల మూలాన మొదలు కాలేదు. “దూకుడు” మరియు “బిజినెస్ మాన్” చిత్రాలు అక్కడ విడుదల కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం “బిజినెస్ మాన్” చిత్రం అక్కడ 200 థియేటర్లలో విడుదల అవుతుంది 1000 థియేటర్లు మాత్రమే ఉన్న తమిళనాడు వంటి ప్రాంతాలలో ఒక డబ్బింగ్ చిత్రం ఈ స్థాయిలో విడుదల అవ్వడం రికార్డ్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్న “శివం” చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా తెరకెక్కించాలని అనుకుంటున్నారు. మరి అక్కడ ఎ చిత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుందో వేచి చూడాలి.
తమిళనాడులో పెరిగిన మహేష్ బాబు బ్రాండ్ వాల్యూ
తమిళనాడులో పెరిగిన మహేష్ బాబు బ్రాండ్ వాల్యూ
Published on Dec 2, 2012 2:17 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఇంట్రెస్టింగ్ న్యూస్!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!
- ‘ఓజి’ నుంచి ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ కి టైం ఫిక్స్ చేసిన థమన్!
- ఓవర్సీస్ మార్కెట్ లో ‘మిరాయ్’ హవా
- ‘ఓజి’ కి ప్రమోషన్స్ అవసరం లేదా?
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- టీమిండియా ధమాకా: యూఏఈ 13 ఓవర్లలోనే ఆలౌట్, 8 మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్లోనే ఔట్
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- యూఎస్ మార్కెట్ లో భారీ మైల్ స్టోన్ కి దగ్గరగా ‘మహావతార్ నరసింహ’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’