కొంతమందికి మంచి టాలెంట్ ఉన్నా ఎందుకో అనుకున్నంతగా సక్సెస్ కాలేరు. ఆ కోవలోకే వస్తోంది ‘వరలక్ష్మీ శరత్‌కుమార్’. హీరోయిన్ కు ఉండాల్సిన క్యాలిటీస్ అన్ని ఉన్నా ఎందుకో స్టార్ హీరోయిన్ గా మాత్రం వరలక్ష్మి శరత్ కుమార్ అవ్వలేకపోయింది. ఇండస్ట్రీ నుండి స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నా.. ఇన్నాళ్లూ ఎక్కువుగా సేడ్ క్యారెక్టర్స్ కే పరిమితం అవుతూ వచ్చింది.
అయితే వరలక్ష్మి ప్రస్తుతం మాస్ మహారాజా క్రాక్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీలో వరలక్ష్మి మంచి క్యారెక్టర్ లో నటిస్తోందట. ఆమె కెరీర్ లోనే ఈ సినిమా ఆమెకు ప్రత్యేకంగా నిలిచిపోతుందట. మెయిన్ గా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో వరలక్ష్మి పాత్రనే సినిమాలో హైలెట్ అవ్వనుందట.
మొత్తానికి సైడ్ పాత్రలకే పరిమితం అయిన వరలక్ష్మికి హీరోయిన్ గా మంచి రోల్ రావడం అనేది నిజంగా మంచి ఆఫరే. ఇక ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ నటించిన డిస్కో రాజా ఇటీవల విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.