2021లో ఎన్టీఆర్ వర్సస్ ఎన్టీఆర్?

2021లో ఎన్టీఆర్ వర్సస్ ఎన్టీఆర్?

Published on Apr 12, 2020 8:30 PM IST


కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గు ముఖం పట్టడం లేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో రోజు రోజుకూ, అంతకంతకు పెరుగుతూ పోతుంది. దీనితో ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ ఏప్రిల్ 14 నుండి 30వరకు పొడిగించాయి. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ మే నెలలో ఖచ్చితంగా మొదలవుతాయనే గ్యారంటీ లేదు. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల మరోమారు వాయిదాపడుందని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ మూవీ విడుదల తేదీ 2021 జనవరి నుండి ఏప్రిల్ కి వాయిదాపడుతుందని తెలుస్తుంది.

ఒకవేళ ఇదే జరిగితే ఎన్టీఆర్ నటించిన రెండు చిత్రాలు అదే నెలలో విడుదల అయ్యే అవకాశం కలదు. ఓ నెల రోజుల క్రితం ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రంతో తన 30వ చిత్రం ప్రకటించారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మేలో ప్రారంభించి, 2021 ఏప్రిల్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటన రోజే తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ ఏప్రిల్ కి షిఫ్ట్ అయితే అదే నెలలో ఎన్టీఆర్ నుండి రెండు సినిమాలు వస్తాయి. ఇక పోటీకూడా ఈ రెండు చిత్రాల మధ్య నడుస్తుంది. ఐతే సినిమాల వసూళ్ల రీత్యా ఈ అరుదైన పరిస్థితి ఏర్పడితే ఎవరో ఒకరు విడుదల తేదీ ముందుకో, వెనక్కో జరుపుకుంటారు.

తాజా వార్తలు