మహేష్ ఫ్యాన్స్ కి ఆయన నెక్స్ట్ మూవీ ఏమిటనేది మిలియన్ డాలర్ ప్రశ్న. సరిలేరు నీకెవ్వరు విడుదలై మూడు నెలలు అవుతుంది. ఆయన నెక్స్ట్ మూవీ విషయంలో అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నా ఆ లక్కీ డైరెక్టర్ ఎవరనేది స్పష్టం కాలేదు. మహేష్ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనే అని రెండు మూడు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మహేష్ ఎవరిని నిర్ణయించుకున్నా అది పాన్ ఇండియా మూవీ కావాలన్నది మహేష్ ఫ్యాన్స్ డిమాండ్. ఈ విషయంలో ఆయన ఫ్యాన్స్ చాలా సీరియస్ గా ఉన్నారట.
టాలీవుడ్ లోని మిగతా స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా మూవీ ప్రకటనలు చేయడమే ఇందుకు కారణం. ఎప్పటి నుండో మహేష్ పాన్ ఇండియా చేయాలని ఉత్సాహ పడుతున్న ఫ్యాన్స్ కోరిక ఇప్పుడు బలంగా మరియు డిమాండ్ గా మారింది. ఎలాగైనా మహేష్ నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా కావలసిందే అని వారు కోరుకుంటున్నారు. మహేష్ ఒకే అంటే ఓ భారీ పాన్ ఇండియా మూవీ సిద్ధం చేయడానికి అనేక దర్శకులు ఉన్నారు. మహేష్ ఆలోచన కూడా అదే అని తెలుస్తున్న నేపథ్యంలో మహేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ చేసే దర్శకుడు ఎవరవుతారో చూడాలి.