పవన్ తో చెయ్యట్లేదు అంటున్న స్టార్ హీరోయిన్.. !

పవన్ తో చెయ్యట్లేదు అంటున్న స్టార్ హీరోయిన్.. !

Published on Apr 11, 2020 8:42 AM IST

పవన్ కళ్యాణ్ రెండేళ్ల విరామం తరువాత వకీల్ సాబ్ తో రీఎంట్రీ ఇస్తున్నారు. హిందీ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్ రోల్ చేస్తున్నారు. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకోగా మే నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.

కాగా ఈ చిత్రంలో పవన్ కి హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. ఈ మూవీలో శృతి హాసన్ చేయట్లేదని స్పష్టత ఇచ్చారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా, కాటమరాయుడు యావరేజ్ రిసల్ట్ దక్కించుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు