చరణ్ కారణంగా ఆచార్య ఆలస్యం కానుందా?

చరణ్ కారణంగా ఆచార్య ఆలస్యం కానుందా?

Published on Apr 11, 2020 3:00 AM IST

చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ రోల్ చాల కీలకం అని సమాచారం. ఈ రోల్ కోసం మహేష్ ని తీసుకున్నారని ప్రచారం జరిగినప్పటికీ అందులో నిజం లేదని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ మూవీ షూటింగ్ లో చరణ్ పాల్గొనడానికి కొంచెం సమయం పడుతుందట. లాక్ డౌన్ పూర్తయిన వెంటనే చరణ్ ఆర్ ఆర్ ఆర్ పూణే షెడ్యూల్ లో జాయిన్ కావాలి. ఒక వేళ ఆర్ ఆర్ ఆర్ కోసం నిరంతరంగా షూటింగ్ లో పాల్గొనాల్సి వస్తే ఆచార్య కోసం ఆయన డేట్స్ కేటాయించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో చరణ్ కారణంగా ఆచార్య షూటింగ్ లేట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కొరకు మొదట త్రిషను తీసుకోవడం జరిగింది. కారణాలేమైనా ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఇప్పుడు ఆమె స్థానంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు