ముందే రావడం నాయక్ కి అడ్వాంటేజ్

ముందే రావడం నాయక్ కి అడ్వాంటేజ్

Published on Dec 1, 2012 3:54 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘నాయక్’ సినిమా 2013లో అన్ని సినిమాలకంటే ముందే జనవరి 9న విడుదల కానుండడం ఎంతో లాభదాయకం. 2013లో రానున్న మొదటి పెద్ద హీరో సినిమా కావడం మరియు సంక్రాతి సీజన్లో విడుదల కానుండడం ఈ సినిమాకి కలిసొచ్చే మరో విశేషం. దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా కలెక్షన్స్ కూడా భారీగా ఉంటాయని తెలుస్తోంది. ఈ సంవత్సరం వచ్చిన ‘రచ్చ’ సినిమా కూడా ఇదే విధంగా విడుదలైంది.

సమ్మర్ సీజన్లో అన్నింటి కంటే ముందే ‘రచ్చ’ సినిమా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ‘నాయక్’ సినిమాలో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ మరియు అమలా పాల్ ఆడిపాడుతున్నారు. వి.వి వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో వేడుక డిసెంబర్ 14న జరగనుంది

తాజా వార్తలు