‘మొక్కే కదా అని వదిలేస్తే..’ అంటున్న చిరు.

‘మొక్కే కదా అని వదిలేస్తే..’ అంటున్న చిరు.

Published on Mar 27, 2020 11:16 AM IST

మెగాస్టార్ చిరంజీవికి మొదటి నుండి సామజిక బాధ్యత ఎక్కువే. చాల ఏళ్లుగా ప్రజా హితం కొరకు ఆయన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటివి స్థాపించడం జరిగింది. ఇక సినీ పరిశ్రమలో ఎవరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆయన సహాయం చేయడంలో ముందుంటారు. ఇక ఆయనకు ప్రకృతి నేస్తాలైన మొక్కలు చెట్లు అన్నా ప్రేమే. ప్రతి రోజు దిన చర్యలో భాగంగా ఆయన తన ఇంటి ఆవరణలో ఉన్న మొక్కలకు స్వయంగా నీళ్లు పోస్తారట. ట్విట్టర్ వేదికగా ఆయన ఓ స్పెషల్ పిక్ పంచుకున్న ఆయన ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.

ఇక ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక మణిశర్మ చాలా కాలం తరువాత చిరు మూవీకి సంగీతం అందిస్తున్నారు.

https://www.instagram.com/p/B-ONnv5DDLa/?igshid=18iybqdu1vv2w

సంబంధిత సమాచారం

తాజా వార్తలు