పవన్ ఫ్యాన్స్ కి కావలసిన హంగుల్ని కలిపారట.

పవన్ ఫ్యాన్స్ కి కావలసిన హంగుల్ని కలిపారట.

Published on Mar 10, 2020 12:35 PM IST


సోషల్ మెస్సేజ్ ఓరియెంటెడ్ మూవీగా వస్తున్న వకీల్ సాబ్ సినిమాపై పవన్ ఫ్యాన్స్ లో ఒకింత నిరాశ నెలకొని ఉంది. పవన్ రెగ్యులర్ సినిమాలలో ఉండే యాక్షన్, స్టైలిష్ బాడీ లాంగ్వేజ్,గ్లామర్ మిస్ అవుతాం అనే భావన వారిలో ఉంది. ఐతే వారు అంతగా మరీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కారణం వకీల్ సాబ్ సినిమాలో ఓ భారీ ఫైట్ పవన్ ఫ్యాన్స్ కొరకు అదనంగా కలపడం జరిగింది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఈ పోరాట సన్నివేశం అద్భుతంగా ఉంటుందని సమాచారం.

ఒరిజినల్ పింక్ చిత్రంలో వృద్ధ లాయర్ గా అమితాబ్ నటించగా ఇక్కడ అదే పాత్రను పవన్ చేస్తున్న తరుణంలో కొంచెం యాక్షన్ అండ్ గ్లామర్ జోడించారు. ఇక వకీల్ సాబ్ మే నెలలో విడుదల కానుంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ఈ చిత్రం తెరక్కుతుండగా దిల్ రాజు, బోని కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

తాజా వార్తలు