టాలెంట్ అండ్ గ్లామర్ ఉన్నా హీరోయిన్ లావణ్య త్రిపాఠి. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ ముందెన్నడూ లేని విధంగా వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. లావణ్య త్రిపాఠికి ఇప్పుడు తెలుగు, తమిళ భాషలలో ఆసక్తికరమైన పాత్రలు వస్తున్నాయి. పైగా ఇటీవల దక్షిణాది సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక, కొన్ని బాలీవుడ్ సినిమాలను ఆమె వదులుకున్నారుట.
కాగా తెలుగులో ‘అర్జున్ సురవరం’ విజయం తర్వాత ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’లో లావణ్యా త్రిపాఠి నటిస్తున్నారు. అందులో సందీప్ కిషన్ సరసన ఆమె కనిపించనున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో ఆమెది హాకీ క్రీడాకారిణి పాత్ర. సినిమా కోసం కొన్ని రోజులు హాకీలో శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో కార్తికేయ సరసన ‘చావు కబురు చల్లగా’ సినిమాలో నటిస్తున్నారు. ‘భలే భలే మగాడివోయ్’, ‘శ్రీరస్తు శుభమస్తు’ విజయాల తర్వాత ప్రముఖ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్ లో ఆమెకు హ్యాట్రిక్ సినిమా అది.
తమిళంలో అథర్వ కథానాయకుడిగా కొరటాల శివ శిష్యుడు రవీంద్ర మాధవ దర్శకత్వంలో మైఖేల్ రాయప్పన్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. అందులో లావణ్యా త్రిపాఠి కథానాయిక. మొత్తానికి లావణ్య బాగానే స్పీడ్ పెంచింది.